China ship: భారత్ తో వివాదం.. మాల్దీవులకు చైనా నిఘా నౌక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంతో మాల్దీవుల వివాదం వేళ పరిశోధన నౌకగా చెప్పే చైనా నిఘా నౌక ఒకటి ఆ దేశం దిశగా ప్రయాణం కొనసాగిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చైనీస్ నౌక జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్‌లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తుందని మైరెన్ ట్రాకర్ యాప్ పేర్కొనింది. ఈ షిప్ ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఈ చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లో 2019, 2020లలో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియెన్ సైమన్ తెలిపాడు.
Read Also: Astrology: జనవరి 24, బుధవారం దినఫలాలు
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే, మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ నౌకపై భారత నేవీ నజర్ పెట్టింది. ఈ నౌక విషయం తమకు తెలుసు.. దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నామని భారత్ నౌవీ అధికారులు పేర్కొన్నారు. చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌తో వివాదాలకు దారి తీస్తున్నాడు. భారత్‌పైనా, ప్రధాని మోడీ పైనా మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత కామెంట్స్ వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసింది. ఇది జరిగిన తర్వాతనే చైనాలో పర్యటించిన ముయిజ్జు.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఆ తర్వాత తమ దేశంలోని భారత సైనికులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డెడ్‌లైన్ పెట్టారు. తాజాగా మాల్దీవుల వైపు చైనా నిఘా నౌక వెళ్తుండటంతో తీవ్ర పరిణామం చోటు చేసుకొన్నది. గతంలో కూడా ఇదే తరహాలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!