నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు చోటు చేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడింది.. దీంతో ఆ కారును లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన ప్రదేశంలోనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీ బైపాస్ దగ్గర ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు ఒక మహిళ, చిన్నారులు, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు.
Read Akkineni Nagarjuna: నన్నెవ్వరు నమ్మలేదు.. చివరికి అమల కూడా.. పిచ్చి పట్టిందా అన్నట్లు.. ?
అయితే, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి చెందిన మహేశ్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె ఇషిక, మహేష్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మచ్చేందర్, అతని కుమారుడు లియాన్స్ సంఘటన ప్రదేశంలోనే మృతి చెందారని పేర్కొన్నారు. ఇక, మచ్చేందర్ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడ్డటంతో మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన మిర్యాలగూడ టూటౌన్ ఎస్సై క్రిష్ణయ్య స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.