డ్రాగన్ కంట్రీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (MDP) రెడీ అవుతుంది. ఇందుకు అవసరమైన సంతకాలను ప్రతిపక్ష ఎండీపీ సేకరించింది. అయితే, అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్‌లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగింది. అందులో నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగితా ముగ్గురిని తిరస్కరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. దీంతో ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగడంతో ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు.
Read Also: Anupama Parameswaran: పెళ్లికూతురులా ముస్తాబైన అనుపమ పరమేశ్వరన్…
అయితే, ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి మహ్మద్ ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానంప్రవేశ పెట్టాలని ఎండీపీ నిర్ణయించింది. పార్లమెంట్‌లో మొత్తం 80 మంది సభ్యులకు గాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. ఇక, అధ్యక్షుడి అభిశంసన తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్‌ల ప్రతినిధులతో సహా మొత్తం 34 మంది సభ్యులు మద్దతు ఇచ్చినట్లు సమాచారం.