మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది.
నేడు స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై ఆకస్మిక దాడి జరిగింది. ఇవాళ మధ్యాహ్నం బీహార్ నుంచి బెంగాల్‌లోని మాల్దాలోకి ప్రవేశిస్తుండగా రాహుల్ ప్రయాణిస్తున్న కారు అద్దంపై కొంత మంది రాళ్ల దాడి చేశారు.
దక్షిణ కొరియా తీరంలో అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16 కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సేఫ్ గా బయట పడ్డారు. కేవలం నెలన్నర సమయంలో కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇది సెకండ్ టైమ్.
సీఎంకి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనక బడి ఉంది.. రేవంత్ రెడ్డి మొదటి సభ భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఏఆర్ కు సీపీ శ్రీనివాస్ రెడ్డి అటాచ్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు.. జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఇచ్చేందుకు చూస్తున్నామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాహుల్ గాంధీ మాటకు అనుగుణంగా బీసీ కుల జన గణన చేస్తున్నామన్నారు.
బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందన్నారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించిందని ఆయన పేర్కొన్నారు.