రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చింది. దీనిపై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో దాదాపు 8 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ కేసులో మరో కీలక నిందితుడు సౌరవ్ ను అదుపులోకి తీసుకున్నారు. టీఎస్ న్యాబ్ పోలీసులు పుణెలో సౌరవ్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ కుల గణన బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాగా, బీసీ జనగణన కోసం ప్రభుత్వం బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు.
మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణననీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు.. మేము ఎవరికి వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇవాళ (ఫిబ్రవరి 17న) అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.
మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జరగనున్నాయి.