Garlic Price: ఎల్లిగడ్డకు కిలో రూ.500.. పంటపొలాల్లో సీసీ కెమెరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garlic price: అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది. దీంతో వంటి గది నుంచి అల్లం, వెల్లుల్లి కనుమరగైతున్నాయి. రెండు వారాల్లోనే వీటి ధరలు రెట్టింపు అయింది. కూరల్లో ప్రధానంగా ఉండే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో వెల్లుల్లి ధర భారీగా పెరిగి కిలో 500-550 రూపాయల మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. రెండు వారాల తర్వాత కొత్త పంట వస్తే ధరలు తగ్గే ఛాన్స్ ఉందని వ్యాపారులు అంటున్నారు. వెల్లుల్లి తక్కువ సరఫరాలో స్థానిక పొలాల నుంచి నగరాలకు వస్తుందంటున్నారు.
Read Also: JSW Steel : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చెందిన రూ.65 వేల కోట్ల ప్లాంట్ పనులు ప్రారంభం
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
కాగా, ఇప్పుడు ఎల్లిగడ్డలు బహిరంగ మార్కెట్ లో కిలో ధర 500 రూపాయలకు పెరిగింది. దీంతో పంట పొలాల నుంచే వాటిని కొందరు దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.
Read Also: LIC Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్.. ఎల్‌ఐసీకి రూ.22 వేల కోట్ల లాభం
అయితే, గత 60 ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులయ్యారు.. కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయంతో ఉన్నారు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తారు.. జిల్లాలో ఉద్యాన పంటల మొత్తం విస్తీర్ణం లక్షా 30 హెక్టార్లు ఉంది. 2023లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి ఆసక్తి చూపలేదు.. సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు తెలిపారు.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!