పశ్చిమ బెంగాల్‌కు చెందిన సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో పాకిస్థానీ క్వాడ్కాప్టర్లను నేలకూల్చేందుకు శుక్రవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద కాపలాగా ఉన్న ఆర్మీ దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలో తన పెళ్లం ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయిందనే ఆవేదనతో భర్త సూసైడ్ చేసుకున్నారు. అయితే, తన భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడంపై ఉన్న వ్యామోహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భర్త కుమార్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది.. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపం చెందిన భర్త హనురూలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
సేమ్-సెక్స్ మ్యారేజీని లీగల్ చేసిన జాబితాలలో గ్రీస్ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు (శనివారం) సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో జపాన్ ఉంది. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదు అయింది.
నేడు భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్ బంద్ ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు.