అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శించారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నగరమైన అవ్దివ్కాపై మాస్కో పూర్తిగా నియంత్రణ సాధించిందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రముఖ విమర్శకుడు అలెక్సీ నవల్నీ శుక్రవారం నాడు జైలులో మరణించాడు.. అయితే, అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీలో అధికార- ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. శాసనసభలో ఇవాళ నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం ప్రవేశ పెట్టాగా.. దానిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్పించుకున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీటిరంగంపై చర్చ కొనసాగాలని తెలిపారు. పాపాల భైరవుడు కేసీఆర్‌ను సభకు పిలవాలి అని ఆయన కోరారు.
కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కళంకంగా మారింది.. ప్రజలను నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు.. కూలిన ప్రాజెక్టును చూసి మీరు సిగ్గుపడాలి అంటూ ఆయన వ్యాఖ్యనించారు.
కాళేశ్వరం నిట్ట నిలువునా చిలిపోయింది అని పేర్కొన్నారు. మేడిగడ్డ కాదు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా పోతది అని NDSA చెప్పింది అని తెలిపారు. జ్యోతిష్యం కాదు, నిపుణులు చెప్పిన మాట అని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.