YCP- TDP Rebel MLAs: టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. ఈసారి రాకపోతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. వైసీపీ- టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల రెబల్ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే ఫైనల్ విచారణ నోటీసులని తెలిపింది.. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: TSRTC MD Sajjanar: మేడారం భక్తులకు బిగ్ షాక్.. బస్సుల్లో కోళ్లు , గొర్రెలకు ప్రవేశం లేదన్నసజ్జనార్
Also Read
అలాగే, ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమకు వివరణ ఇవ్వాలని స్పీకర్ తెలిపారు. అలాగే, మూడు గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని పేర్కొనింది. ఇక, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనం రామనారాయణరెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. సాయంత్రం 4గంటలకు విచారణ ఉంటుంది.. రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారం స్పష్టం చేశారు. కానీ, ఆనంతో సహా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తాము ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదని స్పీకర్ కు సమాధానం ఇస్తూ లేఖ రాశారు.
Read Also: Operation Valentine: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి సల్మాన్ ఖాన్, రామ్ చరణ్!
అయితే, వైసీపీ, టీడీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు ఉండగా.. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు ఉండగా.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లపై కూడా తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?