instagramdown: ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. సర్వీస్ అంతరాయంపై ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. వెంటనే పునరుద్ధరించాలని యూజర్లు విజ్ఞప్తి చేశారు. పలువురి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు అటోమెటిక్ గా లాగౌట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం మందికి ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా తెలుస్తోంది. సమస్యను పరిష్కరించాలంటూ ‘ఎక్స్’ వేదికగా కంప్లంట్ చేస్తున్నారు.
Read Also: Fight In Marriage: చుక్కేసి.. ముక్కకోసం గొడవ.. పెళ్లిలో ఇరువర్గాలు ఘర్షణ..!
కాగా, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి నిలిచిపోయినట్లు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్. కామ్ తెలిపింది. దాదాపు 70 శాతం లాగిన్ సమస్యలను చూపిస్తుంది.. ఇన్ స్టాగ్రామ్ లాగిన్ ఎర్రర్‌లతో సహా అనేక అంశాలలో అంతరాయం కలిగిస్తుందని తెలిపింది. దాదాపు 5,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు భారత్ తో పాటు యునైటెడ్ స్టేట్స్‌లో సమస్యలను ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా ఇన్స్టాగ్రామ్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ ను నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు.