దేశంలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీని దేశ ప్రజలు నరేంద్రమోడీకి కట్టబెట్టపోతున్నారు.. దేశంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం.. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం నరేంద్రమోడీ నాయకత్వంలో నీతివంతమైన ప్రభుత్వం మళ్లీ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. బలవంతపు అరెస్ట్ లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు.
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాసేపట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్లోఅంతర్భాభాగ మేనని అగ్రరాజ్య అమెరికా మరో సారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని తెలిపింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదంలో బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్ కారు నడిపినట్లు గుర్తించారు.
లోక్సభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్లోని ఆరు స్థానాలకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. సంభాల్ నుంచి జియావుర్ రెహమాన్ బుర్క్, బాగ్పత్ నుంచి మనోజ్ చౌదరి, గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాహుల్ అవానా, పిలిభిత్ నుంచి భగవత్ సరణ్ గంగ్వార్, ఘోసీ నుంచి రాజీవ్ రాయ్ పోటీ చేయనున్నారు