Arvind Kejriwal Arrest: నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్.. ఈడీ కస్టడీ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal In ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ గురువారం నాడు రాత్రి అరెస్ట్ చేశారు. ఈడీకి చెందిన అధికారుల బృందం నిన్న సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని.. ఆయనను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. కాగా, భారీ భద్రత మధ్య ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్‌ను తీసుకెళ్లారు. ఈడీ సమన్లకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉపశమనం నిరాకరించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది.
Read Also: Om Bheem Bush: ఉన్నది కాసేపైనా అందాలతో కట్టిపారేసిన హీరోయిన్స్..!
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
అయితే, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఆప్‌తో సహా ఇండియా కూటమిలోని పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అర్దరాత్రి విచారణ చేయాలంటూ కోరారు. కానీ, ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్‌పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టులో ఆప్ నేతలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు.. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఈడీ కస్టడీలోనే కేజ్రీవాల్ ను ఉంచుకుంది.
Read Also: Arvind Kejriwal : లాకప్ లో ఉన్న కేజ్రీవాల్ ఏమి తిన్నారో తెలుసా ?
కాగా, కేజ్రీవాల్‌కు ఈ రోజు (శుక్రవారం) ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి.. ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. విచారణ కోసం దాదాపు 9 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఇక, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మద్దతుదారులు నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!