బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వొద్దు.. మళ్లీ వైకుంఠపాళి వస్తే నాశనమైతాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయి.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం.. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి.. వైకుంఠ పాళి గేమ్స్ వొద్దు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
CM Chandrababu: విజయవాడ నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చిరు, వీధి వ్యాపారులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో కాలినడకన చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళిన సీఎం.
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.
Diwali Festival 2025: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత ఉంది. లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైపోవడంతో సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
Diwali Festival 2025: దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ చేయడానికి అనేక పౌరాణిక, ధార్మిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండగ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో చీకటిని తరిమి కొట్టి భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు.
IND vs AUS: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో కంగారు జట్టు 1 -0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.. కాబట్టి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు?.. వారి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. బాధితులకు మేము అండగా ఉంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
అద్దెపల్లి జనార్థన్, జయ చంద్రారెడ్డి స్నేహితులని మీరే చెప్పారు అని గుర్తు చేశారు. ఇక, జనార్థన్ కు రెడ్ కార్పెట్ వేసి మీరే రప్పించారు అన్నారు. ఆయనతో నా పేరు చెప్పించారు.. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, నకిలీ మద్యం కేసులో ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని జోగి రమేశ్ సవాల్ విసిరారు.