Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును చేర్చడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అద్దెపల్లి జనార్థన్, జయ చంద్రారెడ్డి స్నేహితులని మీరే చెప్పారు అని గుర్తు చేశారు. ఇక, జనార్థన్ కు రెడ్ కార్పెట్ వేసి మీరే రప్పించారు అన్నారు. ఆయనతో నా పేరు చెప్పించారు.. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, నకిలీ మద్యం కేసులో ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని జోగి రమేశ్ సవాల్ విసిరారు.
Read Also: CM Revanth Reddy : వ్యవసాయం దండగ కాదు.. పండగ చేయాలి
ఇక, నన్ను జైలుకు పంపించాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మాజీ మంత్రి జోగి రమేశ్ తెలిపారు. జయ చంద్రారెడ్డికి మీరు టిక్కెట్ ఎలా ఇచ్చారు అని క్వశ్చన్ చేశారు. టికెట్ ఇచ్చినప్పుడు ఆయన లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని తెలియదా అన్నారు. ఈ కేసులో విచారణతో పాటు తిరుమల, బెజవాడ దుర్గమ్మ ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తా, లేదంటే చంద్రబాబు ఇంటికైనా వచ్చి ప్రమాణం చేస్తాను అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మంచి నీటి కుళాయిల కన్నా బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయని వైసీపీ నేత జోగి రమేశ్ విమర్శించారు.