ఈ పండగ సమయంలో కాలుష్యం కూడా బాగా పెరిగిపోతుంటుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మరీ ముఖ్యంగా, పండగపూట గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొగ, భారీ శబ్దాలకు దూరంగా ఉండటం బెటర్. లేదంటే పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడుతుంది అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
UPI Payments: భారత దేశంలో 85 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.
Hyderabad: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని P&T కాలనీ రోడ్ నంబర్ 2లో అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా టపాసులు కాలుస్తుండగా, ఇంటి ముందు పార్క్ చేసిన కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
PAK vs AFG: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు, క్రికెటర్లు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది.
Lakshmi Puja: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఈరోజు (అక్టోబర్ 20న) జరుపుకోనున్నారు. వాస్తవానికి ఈసారి దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్కులు పేర్కొన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. రకరకాల ఈక్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీ ముఖ్యులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని, వాళ్ళ కదలికలు ఇదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా నేతలతో వరుస మీటింగ్స్ పెట్టడం, వారం రోజుల వ్యవధిలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పర్యటించడం లాంటివి నోట్ చేసుకోవాల్సిన పరిణామాలంటున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా... ఏపీలో మొదలైన పొలిటికల్ హీట్ ఇప్పుడు పీక్స్‌కు చేరుతోంది. అంటుకున్న మంట మీద కాస్త నకిలీ మద్యం పడేసరికి ఇక భగ్గుమంటోంది. ఇక్కడే పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోందట ప్రతిపక్షం వైసీపీ. కేవలం కూటమి ప్రభుత్వం ద్వారా.. తమ చేతికి అందిన రెండు అస్త్రాలను ఆలంబనగా చేసుకుని ఫుల్ రీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేయాలనుకుంటున్నట్టు సమాచారం.
ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలరు రాజకీయ నాయకులు. కానీ...ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచినా... జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం, గుర్తింపు ఉన్న ఏ ఇతర పదవులు రాకపోవడంతో...డీలా పడ్డారట జిల్లా టీడీపీ లీడర్స్.