ఒక సంచలనమైన తీర్పును కలకత్తా హైకోర్టు ఇచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ముస్లింలని ఓబీసీలలో చేర్చడాన్ని అక్కడి న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. 75 ముస్లిం కులాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చింది.
ఎన్నికల ఫలితాల తరువాత BRS భూస్థాపితం కాబోతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్పా..! అని ప్రశ్నించారు.
రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం భూ సేకరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2, 911 కోట్ల రూపాయలుగా ఉంది.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే కామాంధుడు తన కింద పని చేసే ఓ కార్మికుకురాలిపై కన్నేసాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకున్న అతను ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు.
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు ఇవాళ (గురువారం) తెల్లవారు జామున బోల్తా పడింది.
తెలంగాణను గత 10 సంవత్సరాలుగా అన్ని విధాలుగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్.. బీజేపీ మీ అందరూ భద్రత కోసం పని చేస్తుంది.. కరోనాను ఆరోగ్యశ్రీలో కలపలేదు కేసీఆర్ అందుకే చాలా ప్రాణాలు పోయాయి.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు ( కృష్ణబాబు ) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కృష్ణబాబు.. మృతదేహాన్ని రేపు సాయంత్రం స్వగ్రామం దొమ్మేరుకు తీసుకు వెళ్లనున్నట్లు బంధువులు ప్రకటించారు.
నైరుతి బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీ వరకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల చివర వరకు తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.