నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఈసీ నిర్దిష్ట షరతులతో చర్చ
తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దిష్ట షరతులతో చర్చించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని ఈసీ షరతు విధించింది. తక్షణం అమలు చేయాల్సిన అజెండా అంశాలపైనే మంత్రివర్గ సమావేశంలో దృష్టి సారించాలని స్పష్టం చేసింది. అదనంగా, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాన్ని వాయిదా వేయాలని EC నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఈసీ గ్రీన్‌సిగ్నల్‌తో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపై ఈ భేటీలో చర్చించనున్నారు. నివేదికలోని సిఫారసులు, తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అలాగే.. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించనుంది. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపైనా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటీఆర్.. టూర్ షెడ్యూల్ ఇలా..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. రాకేష్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లెందు పట్టణానికి చేరుకుంటారు. జేకే గ్రౌండ్స్‌లో పట్టభద్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్‌కు చేరుకుంటారు. గ్రాడ్యుయేట్లతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలకు చేరుకుని.. కళాశాల ఆవరణలో గ్రాడ్యుయేట్లతో సమావేశానికి హాజరుకానున్నారు.బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మాత్రం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సమ్మక్క, సారలమ్మ దర్శనం నిలిపివేత..?
ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ఆవరణలో అర్చకులు, భాగస్వామ్య వర్గాల సమావేశం నిర్వహించారు. వరంగల్‌లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాలను ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని భద్రకాళి దేవస్థానం అర్చకులు ఆరోపించారు. 1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ వరంగల్‌లో మేడారం జాతర కార్యాలయానికి స్థలం కేటాయించగా భద్రకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాల నుంచి నిధులు సేకరించి 2కోట్లతో నగరం నడిబొడ్డున కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే మతతత్వ శాఖ కార్యాలయాలన్నీ కొనసాగుతున్నా.. అమ్మవార్లకు కేటాయించిన స్థలంలో కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు దర్శనం నిలిపివేస్తామని, అధికారులు స్పందించకుంటే జూన్ మొదటి వారంలో వరంగల్‌లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఏపీలో అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధం.. నేడు ఈసీకి రిపోర్ట్ ఇవ్వనున్న డీజీపీ, సీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణలపై ఎన్నికల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి నోటీసులు ఇచ్చి.. ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. దీంతో ఏర్పాటైన సిట్ గత రెండు రోజులుగా విచారణ చేసి.. పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్ట్ ను రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు. ఇక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిటి అధికారుల విచారణ ముగిసింది. సుదీర్ఘంగా కేసులకు సంబంధించిన రికార్డులు, వీడియో దృశ్యాలను పరిశీలించారు. స్థానిక పోలీసులకు సిట్ పలు సూచనాలు చేసింది.. పట్టణంలో జరిగిన అలర్లప్తె సిట్ బృందానికి పోటాపోటీగా టీడీపీ- వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. గొడవలు జరగడానికి మీరెంటే మీరు కారణమంటూ పరస్పరం కంప్లైంట్స్ చేసేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సిట్ బృందం అందజేయనున్నారు. అలాగే, తాడిపత్రిలోని ప్రధాన రహదారులలో అన్ని వాహనాలను పోలీసులు చెక్ చేస్తున్నారు. కీలక నాయకులు వస్తారన్న ప్రచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు.. చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ మూడో రోజు కొనసాగనుంది. చంద్రగిరిలో జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు, కూచువారిపల్లె గ్రామాస్థులు అందించారు. సేకరించిన, వచ్చిన ఆధారాలను పరిశీలించనున్న సిట్ బృందం.. పరిశీలన తరువాత పూర్తి స్థాయి నివేదికను సిట్ ఐజీకి సిట్ అధికారులు అందించనున్నారు. అలాగే, నేడు పల్నాడు జిల్లాలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో సిట్ బృందం పర్యటించనుంది. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణపై విచారణ చేయనుంది. ఇప్పటికే శాఖాపరమైన దర్యాప్తు పూర్తి చేసిన సిట్.. క్షేత్రస్థాయిలో మరికొన్ని గ్రామాలు పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో.. నేడు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించబోతుంది. దొడ్లేరు, వేల్పూరు గ్రామాల్లో సిట్ అధికారులు పర్యటించే అవకాశం ఉంది.
తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. సర్వదర్శనానికి 16 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ గత మూడు రోజులుగా కొనసాగుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఇక, ఫ్రీ దర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. కాగా, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల టైం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఇక.. శనివారం 90 వేలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 39, 559 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. స్వామివారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి వెళ్లే భక్తులు దాదాపు 3 కిలో మీటర్లకు పైగా కాలినడకన క్యూలైన్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దీంతో టీటీడీ అధికారులు ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఐదో దశలో 49స్థానాలకు పోలింగ్.. బరిలో రాహుల్, స్మృతి, ఒమర్, రాజ్‌నాథ్
లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు దశల ఓటింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ ఓటింగ్‌కు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ఏకకాలంలో ఓటింగ్ జరగనుంది. ఈ దశలో ఓటింగ్ జరగనున్న 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు – బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో ఓటింగ్‌ను నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల సన్నాహాలు చేసింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఐదో దశలో ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3, లడఖ్, జమ్మూకాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. ఐదో దశ ఓటింగ్‌లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదో దశలో అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాయ్‌బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ, కైసర్‌గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, ఆర్‌జేడీ నేత, పార్టీ అగ్రనేత, బీహార్ మాజీ చీఫ్ కుమార్తె కరణ్ భూషణ్ సింగ్ ఐదో దశలో పోటీ చేస్తున్నారు. మంత్రి లాలూ ప్రసాద్ సరన్ నుంచి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, చిరాగ్ పాశ్వాన్ హజీపూర్ నుంచి, లాకెట్ ఛటర్జీ బారాముల్లా నుంచి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు.
16 గంటలు గడిచినా దొరకని ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ జాడ
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న అంటే ఆదివారం కూలిపోయింది. సుమారు 16 గంటలు గడిచినా కూలిపోయిన ఆ హెలికాప్టర్ జాడ దొరకలేదు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధ్యక్షుడి భద్రత కోసం ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని, దేవుడు ఆయనను తిరిగి దేశం ఆదుకుంటాడని ఆశిస్తున్నామని అన్నారు. మూడు దేశాలకు చెందిన 100కు పైగా బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. రాత్రి, పొగమంచు కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమయం గడిచేకొద్దీ, ఇరాన్‌లో రైసీ గురించి ఆందోళన కూడా పెరిగింది. ఇరాన్‌లో రైసీ కోసం ప్రార్థనల ప్రక్రియ కొనసాగుతోంది. అనేక నగరాల్లోని మసీదుల్లో వేలాది మంది ప్రజలు తమ రాష్ట్రపతి కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
ఘనంగా జరిగిన దర్శకుల దినోత్సవం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్..
దర్శక రత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ దర్శకులు అందరు కలిసి దర్శక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో దర్శకుల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, విజయేంద్రప్రసాద్, మురళీమోహన్, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్, వెల్దండి వేణు, చంద్రమహేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మారుతి,శ్యామలాదేవి, నాని, అల్లరి నరేష్, అడవి శేష్, ఆనంద్ దేవరకొండ,వంటి తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ దర్శక రత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా దర్శక దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిసి నాకు ఎంతో సంతోషం కలిగిందని అల్లు అర్జున్ తెలిపారు. ఈరోజు తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు సినిమాల వైపు ఎంతో ఆసక్తిగా చూస్తోంది. తెలుగు నటీనటులు మరియు దర్శకులకు ఇప్పుడు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది.తెలుగు దర్శకుల ప్రతిభ కారణంగానే ఇదంతా జరిగింది .దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు చేయాలి అని అల్లు అర్జున్ తెలిపారు.దర్శకులు అందరూ ఎవరి షూటింగ్స్ లో వాళ్ళు ఎంతో బిజీ గా ఉంటారు. అయినా కూడా అందరూ ఒక యూనిటీ గా ముందుకొచ్చి ఇలా దర్శకుల దినోత్సవాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అందరినీ సభా పూర్వకంగా నేను అభినందిస్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు.మీలాగే మిగిలిన 24 క్రాఫ్ట్స్ లోని ప్రతీ డిపార్ట్ మెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళను వాళ్ళు సెలెబ్రేట్ చేసుకుంటే మా అందరి సపోర్ట్ వారికీ ఎప్పుడు ఉంటుంది అని అల్లుఅర్జున్ తెలిపారు.ఆ తరువాత జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు.