Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రైతులపై మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలతో వేధిస్తే.. కాంగ్రెస్ కిసాన్ న్యాయ్ కు కట్టుబడి ఉందన్నారు.
హాంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ వినూత్న ఆలోచనతో కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
న్క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రాం రియాక్ట్ అయింది. పేపర్ లీక్‌తో ప్రమేయం ఉన్న ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఓ జాతీయ మీడియాకు తెలిపింది.
Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వైఖరిని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేశాం.. కానీ, అసెంబ్లీలో మాత్రం మా పార్టీ రాజీపడదని శివసేన, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌ను రద్దు చేయకూడదని ప్రభుత్వం ఎంచుకుందన్నారు. పేపర్ లీక్ అనేది పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందన్నారు.
బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనం అయిందని ఆరోపించింది. ఈ లీకేజీ కుంభకోణంలో 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.
నికోబార్ ప్రజలు తనకు ఓటేయలేదు.. వారికి ఇప్పటి నుంచి గడ్డు రోజులు మొదలైనట్టేనని ఆయన బెదిరింపులకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు ఓట్ల లెక్కింపు జరిగిన మరుస రోజు ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుంది.
Toxic Liquor: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరో 15 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరింది.
Mamata Banerjee: కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సయోధ్య కుదిరినట్లుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Train Stuck On Bridge: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైలు బ్రిడ్జ్ మీద ఆగిపోయింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లు చేశారు.