EAM Jaishankar: ఐరాస 80వ వార్షికోత్సవం నేపథ్యంలో పోస్టల్ స్టాంపు విడుదల చేసిన సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించలేకపోతున్నాయని పేర్కొన్నారు.
టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేలకు పైగా పరుగులతో పాటు టెస్టుల్లోనూ 32 శతకాలు, ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు అని పేర్కొన్నాడు. అలాంటి ప్లేయర్ వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదన్నారు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది.
Car Parking Clash: ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలోని సోరాన్ పట్టణంలో కారు పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ హింసాత్మకంగా మారింది. ఈ వివాదం రెండు మతాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు.
Marathi Row: కోల్కతా నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో భాషా వివాదం చెలరేగింది. ముంబైకి వెళ్తున్నందున మరాఠీ మాట్లాడాలని ఒక మహిళా ప్రయాణికురాలు తనపై ఒత్తిడి చేసిందని యూట్యూబర్ మాహి ఖాన్ ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులను మూసివేశారు. దీంతో పాక్- అఫ్గాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది.
Gambhir vs Rohit Sharma: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ను టీమిండియా 0- 2 తేడాతో చేజార్చుకుంది. ఈ సందర్భంగా భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మతో మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Team India vs Gambhir: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ఆకాంక్షించారు.
Illicit Affair: వివాహేతర సంబంధం కారణంగా తన భార్యతో పదే పదే గొడవ పడి ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన గుజరాత్లోని జునాగఢ్ సమీపంలోని సర్దార్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.