Marathi Row: కోల్‌కతా నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో భాషా వివాదం చెలరేగింది. ముంబైకి వెళ్తున్నందున మరాఠీ మాట్లాడాలని ఒక మహిళా ప్రయాణికురాలు తనపై ఒత్తిడి చేసిందని యూట్యూబర్ మాహి ఖాన్ ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ మాట్లాడుతూ, “మీరు ముంబై వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా మరాఠీ మాట్లాడాలి” అని చెప్పింది. “నేను ఎందుకు మరాఠీ మాట్లాడాలి?” అని మాహి ప్రశ్నించగా, ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. దాంతో మాహి ఖాన్ కేబిన్ క్రూకి సహాయం కోరాడు. వారిముందే ఆ మహిళ అతడిని బెదిరిస్తూ, “ముంబైలో దిగిన తర్వాత చూస్తా నీ సంగతి అంటూ వార్నింగ్ ఇచ్చింది.
Read Also: PM Modi: భారతరత్న కర్పూరి ఠాకూర్‌కు నివాళులర్పించి బీహార్‌లో మోడీ ప్రచారం ప్రారంభం
కాగా, ఈ ఘటనపై యూట్యూబర్ మాహి ఖాన్ స్పందిస్తూ, “మరాఠీ మాట్లాడండి లేక ముంబై వదిలి వెళ్లండి” అని ఆ మహిళ తనకు చెప్పిందని తెలిపారు. “నేను ‘మరాఠీ అర్థం కావడం లేదు’ అన్నందుకే ఆమె నన్ను బెదిరించింది అని పేర్కొంటూ, ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇలాంటి వ్యక్తులను బ్యాన్ చేయాలి.. భాష కారణంగా ఎవరికీ భయం కలగకూడదు అని రాసుకొచ్చాడు. ఇక, ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో 24 గంటలలోపే 95,000 కంటే ఎక్కువ లైక్‌లు, 9,000 కంటే ఎక్కువ కామెంట్‌లు వచ్చాయి.
This woman is threatening her co passenger in an @airindia flight and telling him that he must speak Marathi if he is going to Mumbai otherwise she will teach him a lesson at the Mumbai Airport. Now this is next level of Gundardi by these Female Goons.pic.twitter.com/3ltlpyCsTz
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 23, 2025