Team India: మహిళల వన్డే వరల్డ్ కప్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత టీమిండియా విజయం సాధించింది. 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి సెమీస్లోకి అడుగు పెట్టేసింది.
శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో పురోగతి లేకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ "ఎక్కువగా నిరాశ చెందారు" అని తెలిపారు. రష్యా చమురు సంస్థలపై తాజాగా విధించిన ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని పేర్కొనింది.
Minister Satya kumar: ఉద్దానం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇలా చేస్తే 11 సీట్లు కూడా ఈసారి రావు.. ప్రజలు చిత్తుగా ఓడించారని జగన్ కక్ష కట్టాడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్టు పడుతున్నారు.
Kakinada: కాకినాడ జిల్లా తుని పట్టణంలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. స్థానిక టీడీపీ నేత నారాయణరావు ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే రాజయ్య పేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు. మత్స్యకారులకు సంఘీభావంగా మేం నిలబడతాం.. యావత్ పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా?.. ఎందుకీ నిర్బంధం అని ఆయన ప్రశ్నించారు.
YS Vivek Murder Case: వైఎస్ వివేక హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. కడప సెంట్రల్ జైలులో అప్రూవర్ దస్తగిరి, అతడి భార్య షబానాను విచారిస్తున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మూడోసారి విచారణ చేస్తున్నారు. 2023 నవంబర్ 28వ తేదీన జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటనపై దర్యాప్తు జరుగుతుంది.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు అని సూచించారు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
Tension in Rajayyapeta: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన నేటికి 39వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ సంఘీభావం తెలపనుంది.
Nara Lokesh: గోల్డ్ కోస్ట్ క్యాంపస్ లో గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో ఏపీ విద్య అండ్ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను ఆయన పరిశీలించారు.