Team India vs Gambhir: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. రెండో వన్డేలో మెరుగైన బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికి కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరికి భారత్‌కు నిరాశే మిగిలింది. 265 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు షాకిచ్చారు. స్టార్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(11), హెడ్(28) వెంటవెంటనే పెవిలియన్ కి వెళ్లారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్(74), రెన్ షా(30) కాసేపు దూకుడుగా ఆడి బౌలర్లపై ఒత్తిడి తెవడానికి ప్రయత్నించారు. రెన్ షా అవుట్ అయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ క్యారీ(9) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇక, మాథ్యూ షార్ట్, కూపర్ కొన్నోలీ(61 నాటౌట్) కలిసి జట్టును గెలించాడు.
Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..
అయితే, అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) హాఫ సెంచరీలు సాధించగా.. అక్షర్ పటేల్ (44) రాణించాడు. కాగా అడిలైడ్‌లో భారత్ ఒక వన్డే మ్యాచ్‌లో ఓడిపోవడం మొదటిసారి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించికపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్‌రౌండర్ల వ్యూహాం బెడిసి కొట్టిందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
Read Also: Kurnool Bus Accident: క్షణాల్లో కుటుంబం మొత్తం సజీవ దహనం.. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మృత్యువాత..
కాగా, పిచ్ కండీషన్స్ కు తగినట్లు ఆస్ట్రేలియా మెనెజ్‌మెంట్ ఒక ఫాస్ట్ బౌలర్‌ను పక్కన పెట్టి మరీ స్పిన్నర్ ను తీసుకుంటే, భారత్ మాత్రం ముగ్గురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో మ్యాచ్ ఆడింది. ఆసీస్ జట్టులోకి వచ్చిన ఆడమ్ జంపా 4 వికెట్లు తీసుకుని ఏకంగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే, అడిలైడ్‌లో పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇలాంటి వికెట్‌పై కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. కానీ, గంభీర్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లో కుల్దీప్‌ను బెంచ్ కే పరిమితం చేశాడు. బ్యాటింగ్ డెప్త్‌ను కారణంగా చూపిస్తూ.. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున ఆడిన ముగ్గురు ఆల్‌రౌండర్లు సుందర్, అక్షర్, నితీన్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అలాగే, ఇరు జట్ల మధ్య చివరి వన్డే అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరగనుంది.