Tihar Jail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్న తీహార్ జైలులో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గొడవ జరగడంతో.. ఓ ఖైదీ పదునైన ఆయుధంతో తోటివారిపై దాడికి దిగడంతో.. ఇద్దరు ఖైదీలు గాయపడినట్లు జైలు అధికారులు ఇవాళ (శనివారం) తెలిపారు. తీహార్ జైలులోని సెల్ నంబర్ 8, 9లో ఉన్న ఖైదీల మధ్య శుక్రవారం నాడు ఈ గొడవ చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు ఖైదీలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
Read Also: Harish Rao vs Bhatti Vikramarka: నేను ఒప్పుకున్నానా..? హరీష్ పై భట్టి ఫైర్
కాగా, లిక్కర్ కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసు ఆరోపణలపై అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. తాజా ఘర్షణలతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. జైలులో ఉన్న తమ నేతల భద్రతపై పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Delhi | Yesterday a scuffle broke out between inmates in Tihar Jail number 8 and 9. Two inmates got injured and were taken to a hospital. One of them has been hospitalised: Prison officials
More details awaited.
— ANI (@ANI) July 27, 2024