Bank Fraud: గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా స్కామ్స్ వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం కొనసాగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, రైతుల రుణాల పేరుతో బ్యాంకు సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పాలక వర్గంలోని కొంత మంది కీలక నాయకులు, బ్యాంక్ అధికారులు కుమ్మకై, రైతుల పేరుతో రుణాల స్కామ్ చేసినట్లు ప్రచారం కొనసాగుతుంది. బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించాలని, రైతుల పేరుతో ఉన్న వ్యక్తులకు నోటీసులు పంపించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
Read Also: Viral News: సింగిల్స్‌కు కిర్రాక్ ఆఫర్.. హగ్‌కు రూ.11, ముద్దుకు 110..
ఇక, ఈ వ్యవహారంలో కొంత మంది కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు కూడా కుమ్మక్కైనట్లు సమాచారం. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు సృష్టించి నిధులు మంజూరు చేయించుకున్న కొంతమంది వ్యక్తులు.. ఈ విషయంలో బ్యాంకు కీలక అధికారులు, సూత్రధారులుగా పని చేశారనే ప్రచారం జరుగుతుంది. రైతుల జాబితాతో ఎంత మంది నకిలీ రుణాల బాధితులు ఉన్నారో అనే లెక్కలను బ్యాంక్ ఉన్నత అధికారులు బయటకు తీస్తున్నారు.