BC Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలులో సంస్థాపరంగా వచ్చే సమస్యలు ఎదుర్కొనే తీరుని పరిశీలించేందుకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అస్సాంలో పర్యటించనుంది.
Heavy Rains: విజయవాడ నగరంలో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం కుండపోత వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యంత వేడితో చెమటలు కక్కిన బెజవాడ ప్రజలకు ఊరట లభించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
ఈ నెల 10వ తేదీన మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. కాగా, ఈ కేబినెట్ సమావేశంలోనే ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీతో పాటు పీ-4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Chandrababu: బందరు పోర్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. పోర్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతికి దగ్గరగా బందరు పోర్టు ఉంటుంది.. బందరు పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా అన్ని ప్రాంతాలకు మంచి జరుగుతుంది.
చెత్తను రోడ్ల పైన వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలి అని ఆయన సూచించారు. గుంటూరు నగరాన్ని తప్పనిసరిగా క్లీన్ సిటీగా చేసేందుకు కృషి చేయాలి అన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.