Pemmasani Chandrasekhar: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్ఛతాహి సేవా ముగింపు సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కన్నా ముఖ్యమైనది పరిశుభ్రత అన్నారు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల సేవ వెల కట్టలేనిది.. నగర పరిశుభ్రత కు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి అని పిలుపునిచ్చారు. చెత్తను రోడ్ల పైన వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలి అని ఆయన సూచించారు. గుంటూరు నగరాన్ని తప్పనిసరిగా క్లీన్ సిటీగా చేసేందుకు కృషి చేయాలి అన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Read Also: YS Jagan: చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..
అలాగే, పారిశుధ్య కార్మికుల సమస్యలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక, యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచి ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకుగాను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్కిల్ కమ్యూనికేషన్ పై సమీక్షించారు.