Chandrababu: బందరు పోర్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. పోర్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతికి దగ్గరగా బందరు పోర్టు ఉంటుంది.. బందరు పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా అన్ని ప్రాంతాలకు మంచి జరుగుతుంది.. ఇసుక కొరత ఉందని చెప్పారు.. ఫాస్ట్ ట్రాక్ లో ఇవ్వాలని చెప్పాం.. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయి.. అనేక అవకాశాలు పరిశీలించి వాటిని ప్రోత్సహిస్తాం.. మంచి పోర్టుగా అభివృద్ధి చేసి చూపుతామని సీఎం చెప్పారు. అలాగే, మచిలీపట్నం అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. గతంలో నేనే ఈ ప్రాజెక్టును ప్రారంభించా.. మళ్లీ వాళ్లు మొదలు పెట్టి పనులు ఆపేశారు.. ఈసారి బందరు పోర్ట్ పూర్తి చేసి చూపుతాం.. ఎంతో మంది ఈ బందరు పోర్టు కోసం పెద్ద ఉద్యమాలు చేశారు.. నాలుగు బెర్తులు ఉన్నాయి.. పెంచాల్సిన అవసరం ఇప్పుడు లేదు అని చంద్రబాబు అన్నారు.
Read Also: Israel: ఇరాన్ చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్.. యూఎస్ మీడియాలో కథనాలు
అలాగే, అవసరమైతే భూసమీకరణ మళ్లీ చేపడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బందరు పోర్టు, రైల్వే లైన్, జాతీయ రహదారిలతో మచిలీపట్నం రూపు రేఖలు మారిపోతాయి..
ఇవాళ బందరులో నా పర్యటనలో రోడ్లపై చెత్త పేరుకుపోయి వుండటాన్ని గమనించాను.. గత పాలకులు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేర్చారు.. వీటిని ప్రక్షాళన చేయాలంటే రెండు మూడేళ్లు పడుతుంది.. త్వరలోనే వ్యవస్థలను గాడిలోపెడతాం.. ఇప్పుడు బందరు పోర్ట్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశామని ఆయన తెలిపారు. పీపీపీ మోడల్ లో ప్రాజెక్టు పూర్తి కావాలి..
2025 అక్టోబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Pemmasani Chandrasekhar: గుంటూరు నగరాన్ని క్లీన్సిటీగా చేసేందుకు కృషి చేయాలి..
ఇక, బందరు పోర్టులో రూ. 885 కోట్ల పనులు మాత్రమే అయ్యాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. పోర్టు డెవలపరుని పిలిచి డెడ్ లైన్ పెడతా.. డెడ్ లైనులోపు పనులు పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయి.. ప్రాజెక్టుకు 36.30 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది.. కలెక్టరుకు చెప్పాం.. 3696 ఎకరాలు పోర్టు ఫైనల్ ప్రాజెక్టుకు అవసరం.. ఇది పూర్తైతే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది.. ప్రభుత్వ ఆస్తులను గత ప్రభుత్వం దోచుకుంది.. వాటిపై విచారణ చేసి స్వాధీనం చేసుకుంటాం.. ఆంద్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేస్తుంది అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.