భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామంటూ రెచ్చగొట్టేలా కెనడా విదేశాంగ మంత్రి జోలీ రియాక్ట్ అయ్యారు.
India-Canada Row: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చి భారత్ తో కెనడా కయ్యానికి కాలుదువ్వింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు.
Tamil Nadu Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇగత్పురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే హిరామన్ భికా ఖోస్కర్ అజిత్ పవార్ నేతృత్వంలోని-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
Election Commission: జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగబోతుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం3.30 గంటలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ను తెలిపనుంది.
Mandi Masjid Controversy: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో ముస్లిం పక్షం స్టే ఆర్డర్ తెచ్చింది. సెప్టెంబరు 13 నాటి నిర్ణయంపై తదుపరి విచారణ జరిగే వరకు కార్పొరేషన్ ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది.
Israel PM Netanyahu: లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందే టార్గెట్‌గా ఇజ్రయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుందని వస్తున్న ఆరోపణలపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు.
Pakistan SCO Meeting: పాకిస్థాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.