North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు.
World Bank: ప్రపంచంలోని 26 పేద ఆర్థిక వ్యవస్థలు రోజుకు $2.15 (రూ.180) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న 40 శాతం మంది ప్రజలు 18 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నారని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
Bomb Threat: ఈరోజు (సోమవారం) ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించారు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
US- Israel: ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ వరుసగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అమెరికా నేరుగా బరిలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’ను అందిస్తామని ఆదివారం నాడు వెల్లడించింది.
Israeli Air Strikes: ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాలో తమ దాడిని మరింత విస్తృతం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడి సెంట్రల్ గాజా స్ట్రిప్ నగరమైన డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా హాస్పిటల్‌లోని పాలస్తీనియన్ల గుడారాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది.
Doctors Protest: పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది.
Rajnath Singh: దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు.
స్టైలిష్ లుక్‌తో మహేంద్ర సింగ్ ధోని అట్రాక్ట్ చేస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ యాక్టర్లా కనబడుతున్నారు. ధోనీ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారిపోయాయి.
Cyber Attack In Iran: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.