Mandi Masjid Controversy: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో ముస్లిం పక్షం స్టే ఆర్డర్ తెచ్చింది. సెప్టెంబరు 13 నాటి నిర్ణయంపై తదుపరి విచారణ జరిగే వరకు కార్పొరేషన్ ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. కార్పొరేషన్ కమీషనర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఎహ్లే ఇస్లాం ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధినేత నహీమ్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు. పిల్ విచారణ చేసిన న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన రికార్డులను మూడు రోజుల్లోగా సమర్పించాలని కార్పొరేషన్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసు తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసింది.
Read Also: Honda Activa 7G Launch: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్ తెలిస్తే మైండ్ బ్లాకే!
ఇక, ఈ మండి మసీదు 100 సంవత్సరాల పురాతనమైంది. ఈ మసీదుకు సంబంధించి 1962లో చేసిన సెటిల్‌మెంట్‌లో ఖస్రా సంఖ్యను 1280, 2216, 2217గా విభజించారు. మూడు ఖస్రా సంఖ్యల మొత్తం వైశాల్యం 300.53 చదరపు మీటర్లు ఉంది. అయితే, ఖస్రా నం. 2218 నుంచి 2221 వరకు ఉన్న మొత్తం వైశాల్యం 85.6 చదరపు మీటర్లు కాగా, ఈ ఖస్రా సంఖ్యలన్నింటినీ కలిపితే.. మొత్తం వైశాల్యం 386.16 చదరపు మీటర్లుగా వస్తుంది.. ఇది అహ్లే ఇస్లాం ఆధీనంలో ఉంది. కాగా, అక్టోబర్ 10న హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయం స్టే ఆర్డర్ కాపీని అధికారులకు ముస్లిం పక్షం అందించింది. దీనిపై దేవభూమి సంఘర్ష్ కమిటీ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్టే ఆర్డర్‌ను అధ్యయనం చేసిన తర్వాత అర్బన్ బాడీ అండ్ టౌన్ ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయడానికి వ్యూహం రచిస్తుంది.