Zelensky: సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్స్కీ సంచలన ఆరోపణలు గుప్పించారు. నార్త్ కొరియా నుంచి దాదాపు 10 వేల మంది సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారని పేర్కొన్నారు.
Israel Hezbollah: హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నట్లు హెజ్బొల్లా గ్రూప్ వెల్లడించింది.
Joe Biden: హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభ సూచకం అన్నారు.
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
Yahya Sinwar: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిలిటెంట్ గ్రూప్ చీఫ్, 2023 అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మట్టుబెట్టింది. కాగా, చనిపోయే ముందు సిన్వర్ యొక్క చివరి కదలికలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి.
Israel PM Netanyahu: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. అక్టోబరు 7నాటి దాడుల సూత్రధారి.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం హత మార్చినట్లు ప్రకటించింది.
Manipur BJP MLAs: మణిపూర్‌లోని ఉద్రిక్తతల మధ్య అధికార బీజేపీ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఈ మెసేజ్ లో సల్మాన్ ఖాన్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇప్పించాలనే డిమాండ్ ఉందన్నారు. అలాగే, సల్మాన్ ఖాన్ బ్రతికి ఉండి.. లారెన్స్ బిష్ణోయ్‌తో ఉన్న శత్రుత్వాన్ని అంతం చేసుకోవాలంటే.. తమకు 5 కోట్లు చెల్లించాలని ఓ సందేశం గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చింది.
Nitin Gadkari: తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలను, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తుండటంతో వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
Khalistani Terrorist: గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారని అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడులు చేసేందుకు యత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.