Yahya Sinwar: హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. అతడి తలపై బుల్లెట్ గాయం ఉందని.. దాని కారణంగానే అతడు చనిపోయి ఉంటాడని సమచారం.
Wayanad: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చే నెలలో జరగనున్న వయనాడ్ ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ కోసం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్‌సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు (శనివారం) యూడీఎఫ్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది.
Bomb Threat: ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్‌లో పర్యటించారు.
గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో మరణించిన వారిలో 21 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.
Cuba: క్యూబా దేశంలో ఒక్కసారిగా అంధకారం ఏర్పడింది. దేశంలోని ప్రధాన విద్యుత్ ప్లాంట్లలో ఒకటి ఫెయిల్ కావడంతో జాతీయ పవర్ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ దేశంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తిందని అక్కడి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు.
Karmayogi Saptah: ఈరోజు (శనివారం) దేశ రాజధానిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. పౌర సేవకులకు వ్యక్తిగత, సంస్థాగత సామర్థ్యాల అభివృద్ధికి సరికొత్త ప్రోత్సాహాన్ని అందించడానికి ఉద్దేశించినది.
Supreme Court: భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించింది. కొత్తగా రూపొందించిన సాప్ట్ వేర్ తో ఈ ప్రయోగాత్మక పరిశీలన చేయబోతున్నట్లు తెలిపింది.
ED Raids On Muda office: కర్ణాటకలో సంచలనం రేపుతున్న మూడా స్కాం కేసులో 12 మంది సభ్యులతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఈరోజు (శుక్రవారం) మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై సోదాలు చేస్తుంది.
Hamas New Chief: హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను ముందుండి నడిపించేది ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. రేసులో పలువురు ఉన్నత స్థాయి నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇందులో హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా తెర పైకి వచ్చింది.