IAS officers: డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్ రిపోర్టు చేసేశారు.
Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
YS Jagan: తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు.
Diarrhea Cases: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విజృంభిస్తుంది. వాంతులు, విరోచనాలతో గత నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు చనిపోయారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాకపోవడంతో.. వంద మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తున్నారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సీఎంకు కలెక్టర్లు, అధికారులు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
Nandigam Suresh: అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో తనకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Chandrababu- Pawan: నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. వీరు ఎన్డీయే కూటమిలో భాగమైనందున హర్యానాకు వెళ్తున్నారు.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటక ముందే వాయుగుండం బలహీనపడింది. ఇక, నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన దాటిన వాయుగుండం..