Ind vs Pak: విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు.. గెలిచిన పాకిస్థాన్
- హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు దొరకని శుభారంభం..
- పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్..
- 16 బంతుల్లో 53 రన్స్ చేసిన భరత్ చిప్లీ.. 6 బంతుల్లో 31 పరుగులు చేసిన కెప్టెన్ రాబిన్ ఉతప్ప..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Pak: హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు శుభారంభం దొరకలేదు. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా రాబిన్ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. కాగా, 1992లో మొదటిసారిగా హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ ప్రారంభించినప్పటికి.. 2017 వరకు కొనసాగింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల 2023 వరకు వాయిదా పడింది. ఈ ఏడాది తిరిగి మళ్లీ టోర్నీ స్టార్ట్ అయింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య హాంగ్‌కాంగ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ తదితర 12 జట్లు ఈసారి బరిలోకి దిగాయి.
Read Also: Matangi : ఇండియన్ నేవీకి కొత్త ఆయుధం.. సిబ్బంది లేకుండా 600కి.మీ ప్రయాణించిన ‘మాతంగి’
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
అయితే, ఈ క్రమంలో శుక్రవారం టోర్నీ స్టార్ట్ అయింది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోటీ పడింది. రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలోని టీమిండియా.. నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 రన్స్ చేసింది. కెప్టెన్ ఊతప్ప ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 31 రన్స్ చేయగా.. భరత్ చిప్లీ 16 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నందున రూల్స్ ప్రకారం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
కాగా, భారత్ విధించిన లక్ష్యాన్ని పాకిస్తాన్ ఈజీగా ఛేదించింది. ఆసిఫ్ అలీ 14 బంతుల్లో 55 రన్స్ చేయగా.. మహ్మద్ అఖ్లాక్ 12 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికి తోడుగా కెప్టెన్ ఫహిమ్ ఆష్రఫ్ 5 బంతుల్లోనే 22 రన్స్ తో అజేయంగా నిలిచాడు. ఎక్స్‌ట్రా రూపంలో 4 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో భారత జట్టుపై ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది.
Bharat Chipli chipped in with a cracking 53 off 16 before he had to retire out according to the #HongKongSixes rules. 💪#HongKongSixesonFanCode #ItsRainingSixes pic.twitter.com/IlePJhuPbP
— FanCode (@FanCode) November 1, 2024
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!