Maharashtra PCC: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు.
PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు.
Prashant Kishor: అమెరికాలోని బీహారీ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బీహార్ నిజంగానే విఫల రాష్ట్రం.. దీని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా క్షిణించింది. దీంతో కాలుష్య నివారణకు చేపట్టిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 4 అత్యవసర చర్యలను కొనసాగించాలా వద్దా అని సుప్రీంకోర్టులో ఈరోజు (సోమవారం) విచారణకు రానుంది.
Sambhal Violence: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన సంభల్‌లో కోర్టు ఆదేశాల మేరకు ఓ మసీదులో సర్వే చేస్తుండగా ఆదివారం ఉదయం చెలరేగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం తొలి రోజు మొత్తంగా 84 మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు. అందులో కేవలం 72 మంది మాత్రమే అమ్ముడుపోయారు. మిగతా 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. 10 టీమ్స్ 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏకంగా 467.95 కోట్ల రూపాయలు వెచ్చించాయి.
Maharashtra New CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
Parliament Winter session: ఇవాళ్టి (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు సెషన్స్ కొనసాగనున్నాయి. సెలవులు తీసి వేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 శాసన సభ స్థానాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి.