Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు తదుపరి డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను ఎంపిక చేశారు.
Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (బుధవారం) తుఫానుగా మారుతుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చరిలకు భారత వాతవావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ సస్పెన్స్ ఈరోజు (బుధవారం) ఉదయం వీడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు భేటీ అవుతారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రప్రథమంగా పీపీపీ మోడల్ లో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగాం.. సిఎం రేవంత్ చాలా పకడ్బందీ ప్రణాళికతో వెళ్దామన్నారు.. మాకు ఇచ్చిన ఇంస్ట్రక్షన్ లో ఆర్డినరీ పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలన్నారు.. అభివృద్ధి అంటే కేవలం పశ్చిమ దిక్కు మాత్రమే కాదు నగరం మొత్తం ఉండాలన్నారు.
Minister Komatireddy: జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్‌హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు.
Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది.
Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో పోలీసులు 400 మందిపై కేసు ఫైల్ చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తో పాటు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కొడుకు సోహైల్ కూడా ఉన్నారు.
Eknath Shinde: శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఈరోజు (మంగళవారం) రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు అందజేశారు.
Maharashtra: మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు (మంగళవారం)తో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది.