Medicine: తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని చెత్తకుప్పలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్ దర్శనమిస్తుంది. తెలంగాణ సర్కార్ పంపిణీ చేసిన మందులు, మాత్రలు తదితర వైద్య సామాగ్రిని మహారాష్ట్రలోని లకడ్ కోట గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడేశారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన కొందరు వ్యక్తులు మహారాష్ట్రకు వెళ్తుండగా రోడ్డు పక్కనే పడేసి ఉన్న మందులను గమనించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మందుల కుప్పలో ఆర్బీఎస్కేకు సంబందించిన లాగ్ బుక్ రిసిప్ట్ లభ్యం అయ్యాయి. ఆర్బీఎస్కే సిబ్బంది పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆర్బీఎస్కే వ్యవస్థను తీసుకు వచ్చింది.
Read Also: Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!
కానీ, మహారాష్ట్రలో పడేసిన మందుల కుప్పలో లభ్యమైన లాగ్ బుక్ రిసిప్ట్ సెప్టెంబర్-2023, ఆర్చీ ఎస్కే టీమ్ ‘బి’ గా ఉండగా వాహానం నంబరు టీఎటీ 2006గా ఉంది. మందుల కుప్పలో మాత్రలు, ఇంజక్షన్లు, ఐ డ్రాప్స్, సిరంజీలు, సిరప్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. అయితే, అందులో ఎక్కువ మందులు ఇంకా కాలం చెల్లినవే ఉండటం గమనార్హం. నిబంధనల ప్రకారం మందులు గడువు ముగిసినా బహీరంగ ప్రాంతాల్లో పడేయకూడదు.. మన రాష్ట్ర పరిధిలోనే ఎక్కడైనా పడేస్తే సమస్యలు తలెత్తుతాయనుకుని సమీపంలోని మహారాష్ట్ర ప్రాంతంలో పడేశారనే ఆరోపణలు వస్తున్నాయి.