CM Revanth Reddy: పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు 8084 మందికి నియామక పత్రాలు అందించాం.. యువత ఉద్యోగాల కోసం చేసిన పోరాటం రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిందన్నారు. ఇక, ప్రజల ఆశీస్సులతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రజలు ఓట్లు వేయడంతోనే మాకు ఈ పదవులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ ప్రేమతోనే నేను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు.. తన ఫాంహౌస్ లో ఎకరాకు రూ.కోటి సంపాదిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. 10 ఏళ్లు పాలించిన ఆయన.. ఎకరాకు రూ.కోటి ఎలా సంపాదించాలనేది ప్రజలకు చెప్పలేదని విమర్శించారు. ఆ రహస్యం ఏంటో ఈ రోజుకూ అంతుచిక్కడం లేదని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు.
Read Also: Hansika : నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సీనియర్ నటి కుమార్తె హవా
అయితే, గత ప్రభుత్వం చేయని పనులను మనం చేసుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు డిపార్ట్మెంట్ల వారిగా రూ. 1035 కోట్ల పనులను మంజూరు చేసుకున్నాం.. ఈ రోజు ఈ ప్రాంతానికి ఇన్ని నిధులతో అభివృద్ధి చేసుకోవడానికి కారణం.. ఆరోజు మీరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలవడమే అందుకు కారణం అని చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్ లో తుమ్ముడి హెట్టి ప్రాజెక్టు కట్టిస్తాం.. భవిష్యత్ లేదు అనే కారణంతోనే కొంతమంది మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. 10 నెలల పాలనపై ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టే సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఇక, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. ప్రధాని మోడీ ఏ ఒక్క రోజు అయినా ఇన్ని నియామక పత్రలు అందించారా అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
Read Also: School Wall Collapse: కూలిన పాఠశాల గోడ.. మూడో తరగతి విద్యార్థిని మృతి
అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. అది కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు 50 సంవత్సరాలైన వాటి పరిస్థితిని.. ఇప్పుడు కట్టిన కాళేశ్వరం పరిస్థితి చూడండిని తెలిపారు. 10 ఏండ్ల గత పాలకుల పని తీరుపై చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమా కేసీఆర్.. కేసీఆర్ ఐకేపీ సెంటర్ల నుంచి వడ్లు కొనుగోలు చేయమన్నాడు.. కానీ మేము మాత్రం వడ్లు పండించమన్నాంటున్నాం.. అలా చేసిన వారికి బోనస్ కూడా ఇస్తామని చెప్తున్నాం.. 9 నెలల్లోనే 21 లక్ష కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇక, కోటి మంది ఆడ బిడ్డలను కోటిశ్వరులుగా చేయడమే మా లక్ష్యం.. అలాగే, కేజీ టూ పీజీ అంత ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.