Gaza: ఇజ్రాయెల్ ఆధినంలో ఉన్న గాజాలోని పాలస్తీనియన్లు పడుతున్న బాధలు అంతులేని అగచాట్లకు నిదర్శనం అని చెప్పాలి. కనీసం ఆహారం దొరక్క వాళ్లు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నాడు ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం దగ్గర ఫ్రీగా ఆహార పంపిణీ చేసే కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు.
Bangladesh: భారతదేశంలోని ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్ సర్కార్ ఆదేశించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. కోల్‌కతాలోని డిప్యూటీ హైకమిషనర్ షిక్దార్ మహమ్మద్ అష్రఫుల్ రహ్మాన్, త్రిపురలోని అగర్తలలో గల అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహమ్మద్‌ను రీకాల్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోను.. త్వరలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎలిసీ ప్యాలెస్ నుంచి ఫ్రాన్స్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మీరు ఐదేళ్లు పాలించమని నాకు అధికారం ఇచ్చారు.. అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తాను.. ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసకెళ్లే బాధ్యత నాపై ఉందని మెక్రాన్ చెప్పుకొచ్చారు.
స్వెట్లానా డాలి అనే రష్యా మహిళ డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో పారిస్‌కు వెళ్లేందుకు న్యూయార్క్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. అయితే, ఆమె దగ్గర బోర్డింగ్ పాస్ లేకపోవడంతో భద్రతా సిబ్బంది వెనక్కి తిప్పి పంపించారు. ఆ తర్వాత డాలి ఎయిర్ ఐరోపా సిబ్బందితో మాటలు కలిపి మరో రూట్లో పారిస్‌కు వెళ్లే విమానం ఎక్కారు.
Smartphone Effects: ప్రస్తుత కాలంలో మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో మనుశుల మధ్య వ్యక్తిగత సంబంధాలను దెబ్బ తీస్తోంది. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ వల్ల పచ్చటి సంసారాల్లో చిచ్చు పెడుతుంది. తల్లిదండ్రులు, భార్యభర్తలు, పిల్లలతో ఉండే సంబంధాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని వివో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది.
Sambhal Violence: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనలకు ముందు ఈరోజు (డిసెంబర్ 6) సంభాల్‌లో డీఐజీ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో ఎస్పీ సహా ఇతర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Delhi Chalo: పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెబర్ 6) దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్‌గా బయలు దేరుతుందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు.
Travis Head: రెండో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టులో బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానం కోల్పోనున్నాడని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీనికి ఆతిథ్య టీమ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రియాక్ట్ అయ్యారు. సన్నీ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇవాళ (డిసెంబర్ 5కి) జరిగిన సమావేశం మరోసారి వాయిదా పడింది. అయితే, మరోసారి ఐసీసీ సమావేశాన్ని రెండు రోజులకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. పాకిస్థాన్ ఆతిథ్యంలోనే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సింది. కానీ, పాక్‌కు వెళ్లి ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలతో అక్కడికి టీమిండియాను పంపించమని తేల్చి చెప్పింది.