తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కార్ పైనా విమర్శలు గుప్పించారు. కాగా, మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎత్తి చూపిస్తూ.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.
ENG vs NZ: క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్ టీమ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 147 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షలకు పైగా రన్స్ చేసిన మొదటి జట్టుగా ఇంగ్లీష్ టీమ్ అవతరించింది.
Small Vehicles: భారత్‌లో ప్రతి ఒక్కరూ తమకు సొంత కారు కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఈ కారణంతోనే సరసమైన ధరల్లో ఉన్న చిన్న కార్లకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ డిమాండ్ 2025లో మరింత ఎక్కువగా ఉండబోతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 'నోమురా' తన రిపోర్టులో వెల్లడించింది.
Egg Prices: ప్రస్తుతం కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా 7 రూపాయలను దాటేసింది. కార్తీకమాసం ముగియడంతో.. గుడ్డు ధర అమాంతం పెరిగిపోయింది.
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్ లో తనకు హోంశాఖను ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తెలిపారు. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌కు హోంశాఖ ఇచ్చారని గుర్తు చేశారు.
Sam Pitroda: గత కొన్ని వారాలుగా నా ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, సర్వర్లు పదే పదే హ్యాక్ చేశారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్పర్సన్ శామ్ పిట్రోడా ఈ రోజు (డిసెంబర్ 7) తెలిపారు.
South Korea President: దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ స్పందించారు. ఈ సందర్భంగా తల వంచి అడుగుతున్నా.. నన్ను క్షమించండి.. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించనని దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Google Maps: గూగుల్ మ్యాప్ మరోసారి రాంగ్ రూట్ చూపించి మరో కుటుంబాన్ని మోసం చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్ తల్లి తప్పిదంతో ముగ్గురు మరణించగా.. ఈసారి ఓ కుటుంబాన్ని ఏకంగా అడవుల పాలు చేసేసింది.