America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ముంబైలోని కుర్లాలో ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకుపోగా.. ప్రమాదంలో నలుగురు మృతులు శివమ్ కశ్యప్, కనీజ్ ఫాతిమా, అఫీల్ షా, అనమ్ షేక్ లు చనిపోగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు.
Belagavi: మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (యూబీటి) నేత ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది చిన్న పిల్లల ప్రకటనలా ఉందన్నారు.
Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది.
India- Bangladesh: బంగ్లాదేశ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యూనస్, మిస్రీల మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగింది.
Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు.
2025లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసిందని అనేక కథనాలు వస్తున్నాయి.
సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తాము సునిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అక్కడి అన్ని పార్టీలు సమష్టిగా కృషి చేయాలన్నారు.
Chinmoy Krishnadas: హిందూ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అయితే, ఆయనపై తాజాగా మరో కేసు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో హిందూ సన్యాసి మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరగడంతో కృష్ణదాస్ సహా 164 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
PM Modi: ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.