Collectors Conference: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆరు నెలల ఎన్డీయే ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు స్టార్ట్ కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష మందికి పైగా ఉండగా.. మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉండగా.. ఇప్పుడే మొదటిరోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మాత్రమే భయపడతారని డొనాల్డ్ ట్రంప్ కు చెప్పినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు. ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ లతో ఇటీవల భేటీ అయిన విషయం గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Shaktikanta Das: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజు ( డిసెంబర్ 10) తన పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Justin Trudeau: హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమపై ట్రంప్ అదనపు టారీఫ్ లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు.
పార్లమెంటుకు వచ్చిన వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఒక చమత్కారమైన బ్యాగ్‌ని తీసుకెళ్లారు. ఆ బ్యాగ్‌పై ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల ఫోటోలు ఉండగా.. మరోవైపు మోడీ- అదానీ భాయ్ భాయ్ అనే నినాదంతో కూడిన డిజైన్ బ్యాగ్ ను ఆమె తీసుకెళ్లారు.