Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.
RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సునీల్ అంబేకర్ విజ్ఞప్తి చేశారు.
Tesla Showroom In Delhi: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలోనే భారత్ లో అడుగు పెట్టబోతుంది. ఢిల్లీలో షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పార్లమెంటులోకి ప్రవేశించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కారు దిగిన వెంటనే, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు గులాబీ పువ్వుతో పాటు త్రివర్ణ పతాకాన్ని అందజేశారు.
రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సొంత బలంతోనే ముందుకు వెళ్లనుందని ఆప్ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
Donald Trump: యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈక్రమంలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ భారీ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి స్పీడ్ గా పర్మిషన్స్ మంజూరు చేయడంతో పాటు పర్యావరణ అనుమతులను కూడా వెంటనే ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు.
Fairness Cream: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామి లిమిటెడ్‌పై వినియోగం ఫోరమ్ 15 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి చెందిన ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ మోసపూరితంగా.. అలాగే, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఓ వ్యక్తి కంప్లైంట్ చేశాడు.
బైడెన్ మాట్లాడుతూ.. 2020లో కరోనా మహమ్మారి విజృంభణ స్టార్టింగ్ లో బాధితులకు అందజేసిన రిలీఫ్ చెక్స్‌పై డొనాల్డ్ ట్రంప్ తన పేరు రాసుకుని మంచి పేరును సంపాదించుకున్నాడని ఆయన తెలిపారు. కానీ, ఆ మరుసటి ఏడాది అధ్యక్ష పదవి చేపట్టిన.. ట్రంప్ లాగా నేను చేయలేకపోయానని చెప్పుకొచ్చారుు. తానో ‘స్టుపిడ్’ అని అంటూ అతడు విచారం వ్యక్తం చేశారు.