Bengaluru Techie: బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ సూసైడ్ కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చని కోర్టులో న్యాయమూర్తి ముందే భార్య అతడిని అనడం.. దానికి జడ్జ్ నవ్వడం అతుల్ సుభాష్‌ను తీవ్రంగా బాధించిందని అతడి బంధువులు తెలిపారు.
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.
Snowfall: జమ్ము కశ్మీర్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి.
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి దూసుకుపోయాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంపాదించిన వ్యక్తి ఇంకొకరు లేరు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో ఆయన మరి కొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక, ఈ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు సమాచారం.
వైవాహిక చట్టాల దుర్వినియోగంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే విడాకుల సందర్భంగా తీసుకునే భరణం గురించి న్యాయస్థానం విధివిధానాలు వెల్లడించింది. మొత్తం 8 మార్గదర్శాలను సిద్ధం చేసింది.
Rajasthan: ఆడుకుంటూ వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల లోతులో గల బోరు బావిలో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఇక, బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల కష్టపడింది.
Amit Shah: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాత ప్రస్తుతం ఆయన అధ్యక్షతన జరగబోయే భద్రతా సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
Union cabinate: ఢిల్లీలో ఈరోజు (డిసెంబర్ 12) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లోని బీచ్ రోడ్లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్గా పోలీసులు గుర్తించారు.