Donald Trump: యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈక్రమంలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ భారీ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి స్పీడ్ గా పర్మిషన్స్ మంజూరు చేయడంతో పాటు పర్యావరణ అనుమతులను కూడా వెంటనే ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నాడు ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్ట్‌లో ఈ విషయం తెలిపారు. ట్రంప్ ప్రతిపాదన అద్భుతంగా ఉందని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, డోజ్ బాధ్యతలు నిర్వహించనున్న ఎలాన్ మస్క్ తెలిపారు.
Read Also: Singer : ఓర్నాయనో.. రెండేళ్లలో రూ.16000కోట్లు సంపాదించిన సింగర్
అయితే, అమెరికా నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ పాలసీ రూల్స్ ప్రకారం.. ఏదైనా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చే ముందు పర్యావరణ ప్రభావాలపై అంచనా వేస్తారు. కానీ, డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనలను పర్యావరణ సంస్థలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇది ఎన్ఈపీఏ నిబంధలను ఉల్లంఘిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ప్రణాళికలు చట్టవిరుద్ధమైనవి.. వీటి వల్ల దేశంలో కాలుష్యం మరింత పెరిగిపోతుందని వాషింగ్టన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ యాక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు అమెరికాను కార్పొరేట్ బిడ్డర్లకు అమ్ముకునేందుకు ట్రంప్ ఇలాంటి ఆఫర్‌లు ప్రకటిస్తున్నారని విమర్శిస్తున్నారు.
Any person or company investing ONE BILLION DOLLARS, OR MORE, in the United States of America, will receive fully expedited approvals and permits, including, but in no way limited to, all Environmental approvals. GET READY TO ROCK!!!
Donald Trump Truth Social 02:16 PM EST…
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) December 10, 2024