Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగిన జకోవిచ్..
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఫైనల్‌కు అలెగ్జాండర్ జ్వెరెవ్..
- సెమీస్‌లో గాయంతో వైదొలిగిన నొవాక్ జకోవిచ్..
- తొలి సెట్ ఓటమి అనంతరం రిటైర్డ్‌హర్ట్ ప్రకటించిన జకోవిచ్..
- అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిద్దామనుకున్న జకోవిచ్ కు నిరాశే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Novak Djokovic: తన కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్‌ను గాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి సెట్ తర్వాత రిటైర్డ్‌హర్ట్ ప్రకటించి బయటకు వెళ్లిపోయాడు. గాయంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నాడు. జోక్ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో జర్మనీ స్టార్ జ్వెరెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు వెళ్లాడు. ఈరోజు జరగనున్న రెండో సెమీస్‌లో విజేతగా నిలిచే ప్లేయర్ తో అతడు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాడు.
Read Also: Mumbai Crime: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రైవేట్ భాగాల్లో రాళ్లు, బ్లేడ్!
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే, ఇటలీకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ సినర్‌తో అమెరికా సంచలనం బెన్ షెల్టన్ మరో సెమీస్‌లో పోటీ పడబోతున్నాడు. ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక, ఛాంపియన్స్ పోటీలో ఉంటే.. గేమ్ ఎలా ఉంటుందనే దానికి ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి సెమీస్ మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. ఓ వైపు గాయంతో ఇబ్బంది పడుతున్నా.. జకోవిచ్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. కానీ, జ్వెరెవ్ కూడా దూకుడై ఆటతో దాదాపు గంట 21 నిమిషాల పాటు తొలి సెట్ సాగింది. మొదటి సెట్ ను జ్వెరెవ్ 7-6 (7/5) తేడాతో దక్కించుకున్నాడు. ఒక్కో పాయింట్ కోసం ఇరువురూ తీవ్రంగా పోటీ పడ్డారు. ఒకరి సర్వీస్‌ను మరొకరు బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్లారు. కానీ, చివరికి జ్వెరెవ్ గెలవగా.. తొలి సెట్ ముగియగానే జకోవిచ్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
Not how we wanted your campaign to end, @djokernole.
Thank you for another wonderful Australian summer. Well played and best wishes for a speedy recovery.#AO2025 pic.twitter.com/d5VJ6YNBeN
— #AusOpen (@AustralianOpen) January 24, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!