Ameenpur: అమీన్పూర్లో పిల్లల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నాం.. ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం.. నా గొంతులో ఏదో పట్టుకున్నట్లు అయింది.
Minister Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో తన నివాసం దగ్గర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా దర్బార్ కు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ( మార్చ్ 28) చెన్నై వెళ్లనున్నారు. అడయార్‌లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది.
Minister Narayana: విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్వర్ణాంధ్ర 2047 సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి మురికివాడల రహిత నగరంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
జగన్ పాలనలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది.. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజాధానం వృధా అయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అలాగే, గత ప్రభుత్వంలో పోలవరానికి వచ్చిన డబ్బులు దారి మళ్లించారు.. దాని వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. ఇక, గత కొన్నేళ్లగా ఎదురైన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోలవరం నిర్వాసితులు వివరించారు.
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అని జగన్ ప్రశ్నించారు.