హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారి ఉగాది పంచాంగ శ్రవణం అద్భుతంగా సాగింది. అలాగే బెంగళూరు నాయర్ సిస్టర్స్ చేసిన విష్ణువైభవం భరత నృత్యం, ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం చేసిన విశ్వనాధామృతం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. నిహారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంతో పాటు వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చే బిల్లుపై చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షాలు వాకౌట్ ను ఒక సాకుగా చెబుతున్నాయని ఆరోపించారు.
వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
illicit Relationship: బీహార్‌లోని సీతామర్హిలో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితుడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో 22 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Bajinder Singh: పంజాబ్‌కు చెందిన పాస్టర్, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్ బాజిందర్ సింగ్‌కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. తాజాగా శిక్షను ఫైనల్ చేసింది. బాజిందర్ సింగ్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఈరోజు (ఏప్రిల్ 1న) తీర్పు వెల్లడించింది.
Yogi Adityanath: తమిళనాడు- కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో యూపీ యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోని స్కూల్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ లాంటి భాషలను బోధిస్తున్నామని వెల్లడించారు.
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో గత రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ది పరామర్శించారు.
Elamanchili: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన రాజకీయం కీలక మలుపు తిరిగింది. చైర్ పర్సన్ రమా కుమారిపై ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేందుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు.
Visakha Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది.