Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. ఈ రోజు (ఏప్రిల్ 2న) విచారణకు రావాలంటూ శ్రవణ్ రావుకు గత విచారణ సమయంలో సిట్ నోటీసులు జారీ చేసింది.
Bird Flu Death in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్ తో మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకి మరణించిందని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు.
Visakhapatnam: విశాఖపట్నంలో స్కూల్ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలని మద్యానికి పణంగా పెట్టాడు ఆటో డ్రైవర్.. మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది.
Kesineni Nani: ప్రస్తుతం పార్లమెంటులో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం 2024 పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై మాజీ ఎంపీ కేశినేని నాని తన అభిప్రాయం వెల్లడించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 44 బార్లను ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ పద్ధతిలో ప్రభుత్వం కేటాయించనుంది. రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లు ఈ-వేలం ద్వారా కేటాయింపులు జరపనున్నారు.
Minister Lokesh: ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో 375 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో కలిసి లోకేశ్ పాల్గొననున్నారు.
YS Jagan: ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.