తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక సమరమే అంటూ.... ఉద్యోగ సంఘాల జేఏసీ పేరుతో వచ్చిన ప్రకటనపై సీఎం తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం.
మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం... తెలంగాణలోనే అత్యంత ఖరీదైన సెగ్మెంట్. ఐటీ సెక్టార్ విస్తరించిన ఏరియా. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. అలాంటి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది.
YS Jagan: రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
Minister Narayana: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జరిగిన కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడిస్తూ.. సీఆర్డీఏ 47వ ఆధారిటీతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కూడా జరిగిందన్నారు. 2014- 19లో గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కు సంబంధించి రూ. 514 కోట్ల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
AP Govt: గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. రూ. 1,410తో 11 వస్తువులను బేబీ కిట్ ద్వారా పంపిణీ చేయనున్న ఏపీ సర్కార్. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
గ్రామ వార్డ్ సచివాలయంలో కొత్త రేషన్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలి అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల చెప్పారు. జూన్ లో అందరికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నా వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తించి శిక్షను తగ్గించాలని కోరాగా.. 10 సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదు అని అతడ్ని సీబీఐ కోర్టు జడ్జి ప్రశ్నించారు. మీరు యావ జీవ శిక్షకు అర్హులని తేల్చి చెప్పారు న్యాయమూర్తి. ఇక, తాను సామాజిక సేవ చేయడానికి ఇంకా నాలుగు సంవత్సరాల పైబడి ఉంది అన్నారు. ఈ నేపథ్యంలో శిక్ష తగ్గించాలని గాలి జనార్ధన్ రెడ్డి కోరారు.
CM Chandrababu: దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు.